భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

మోడల్ స్కూల్‌లో ఈనెల 11 నుంచి సమ్మర్ క్యాంప్

WhatsApp Image 2026-05-09 at 6.44.57 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు నెల్లికుదురు మండల కేంద్రంలోని పీఎంశ్రీ టీజీ మోడల్ స్కూల్‌లో ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు ఉచిత సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్యాంపులో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఉంటుందని, మొత్తం 100 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కేవలం మోడల్ స్కూల్ విద్యార్థులే కాకుండా ప్రభుత్వ, జడ్పీ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ క్యాంపునకు హాజరు కావచ్చని తెలిపారు. ఆసక్తి గలవారు మే 10న 9912503514 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తమ సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలతో పాటు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, క్లాసికల్ డాన్స్, యోగా, హెల్త్ ప్రాక్టీస్, ఫన్ లెర్నింగ్ యాక్టివిటీస్‌లలో నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. క్యాంపునకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం పైన పేర్కొన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.