భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం జాతీయ రహదారి 44పై దూద్గాం గ్రామ శివారులో పోలీసులు అక్రమ ఇసుక లారీని శనివారం సీజ్ చేశారు. రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం బయటపడింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ గ్రామం వైపు నుంచి నిర్మల్‌కు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను విచారించగా సరైన అనుమతి పత్రాలు చూపించకపోవడంతో వాహనాన్ని సీజ్ చేసినట్లు మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను లారీ డ్రైవర్ నాగరాజుతో పాటు, వాహన యజమాని ఈశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, మే 2026, ఆదివారంభారత్ సమాచార్