భారత్ సమాచార్.నెట్, నిర్మల్ జిల్లా: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శనివారం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన శ్యాంఘడ్ కోట, ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులకు కీలక సూచనలు చేశారు. చారిత్రక శ్యాంఘడ్ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలపై, అలాగే ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద సుందరీకరణ పనులు, వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, తహశీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
24, మే 2026, ఆదివారంభారత్ సమాచార్