భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, జూన్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నూతన మున్సిపల్ కమిషనర్‌కు సన్మానం

WhatsApp Image 2026-06-04 at 3.27.14 PM

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గడ్డపోతారం మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన పి.తాన్య 15వ వార్డు కౌన్సిలర్ సందేయా ఇంద్రసేన మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడ్డపోతారం మున్సిపాలిటీ అభివృద్ధికి కమిషనర్ సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల పారిశుధ్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కమిషనర్ పి. తాన్య మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజలకు మేలు చేసేలా చూస్తానాని అన్నారు.