భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

నర్సాపూర్ కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

WhatsApp Image 2026-06-05 at 5.27.00 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాల ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. వృక్షాలు మానవాళికి అవసరమైన ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయని తెలిపారు. వృక్ష సంపద పెరగడం వల్లే సకాలంలో వర్షాలు కురిసి, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని, పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.