భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని చిన్న తడ్గుర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సూర్యవంశీ ప్రకాష్ సందర్శించారు. శనివారం రోజున ప్రజా ప్రతినిధుల సమక్షంలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. అంగన్వాడీకి వచ్చిన వారికి గుడ్లు, పాలు, బియ్యం, పప్పులు అందించారు. ప్రతీ రోజు పౌష్టికాహారం తిని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అలాగే వర్షాల వల్ల వచ్చే వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతీ రోజు సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని, ఇంటి పరిసరాలను మంచిగా ఉంచుకోవాలని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్