భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోతే పోరాటం తప్పదు

WhatsApp Image 2026-06-10 at 6.01.22 PM

భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా: అర్హులైన జర్నలిస్టులందరికీ తక్షణమే అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ హెచ్చరించింది. బుధవారం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే సమగ్రమైన హెల్త్ కార్డులు మంజూరు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

జీవో నెంబర్ 252 వల్ల అక్రిడిటేషన్ల జారీలో ఆలస్యం జరుగుతోందని, అధికారులు కొర్రీలు మానుకొని అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ సంఘం నిరంతరం పోరాడుతుందని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని యాదగిరి పేర్కొన్నారు. ఇదే నెల చివరలో జిల్లా యూనియన్ మహాసభలు నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకోనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ అహ్మద్ ప్రకటించారు. ఈ సమావేశంలో అక్రమ్ పటేల్, మసూద్ ఖాన్, శ్రీనాథ్, బాసిత్, అన్వర్ హుస్సేన్, హాజీ, మినాజ్, సిద్ధిక్, విష్ణు వర్ధన్, జోగిపేట భూమన్న, యాదగిరి, అబ్దుల్ మతిన్, విల్సన్, అంజయ్య, సంగమేశ్, వెంకటేష్ గౌడ్, సిద్దు, రమేష్ గౌడ్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.