భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ విక్రయిస్తున్న ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ గంగా ప్రసాద్ డిమాండ్ చేశారు. భైంసాలోని స్థానిక చైతన్య హైస్కూల్, చాణక్య స్కూల్లో బుక్స్, యూనిఫామ్స్, స్టేషనరీ పంపిణీపై ABVP నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై స్థానిక MEO సుభాష్ కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి పాఠశాలల్లో ఉన్న పుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేశారు.
ఈ సందర్బంగా ABVP నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ ధనార్జనే ధ్యేయంగా విద్యతో వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని వాపోయారు. ప్రైవేటు స్కూళ్లల్లో పుస్తకాల వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్న విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్ముతున్న ప్రైవేట్ స్కూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల ABVP ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.