భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: మజ్ను మండలంలోని షేకపూర్ గ్రామంలో సోమవారం రోజున ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో గ్రామ సర్పంచ్ తుకారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రభుత్వాన్ని పేద విద్యార్థులకు ఎలాంటి కష్టం కాకుండా చూసుకోవాలన్నారు. కార్పొరేట్ బడుల్లో కన్నా నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని చూపించారు. పిల్లలకు ఉదయం అల్పాహారం, యథావిధిగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కావున గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ ప్రభుత్వ బడుల్లోని చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఫకృ పటేల్, ఉపాధ్యాయులు చంద్రకాంత్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
15, జూన్ 2026, సోమవారంభారత్ సమాచార్