భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా కొత్తపల్లి గ్రామానికి చెందిన జనంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించి ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేస్తానని తెలిపారు.
BHARATH SAMACHAR DIGITAL
19, జూన్ 2026, శుక్రవారంభారత్ సమాచార్