భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

వాడి గ్రామానికి రోడ్డు కోసం మోకాళ్లపై కూర్చుని నిరసన

రోడ్డు కోసం వినూత్న నిరసన

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ భైంసా మండలం వాడి గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రోడ్డుపైనే మోకాళ్లపై కూర్చుని “మాకు రోడ్డు కావాలి” అంటూ నినాదాలు చేశారు.

గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వర్షాకాలంలో తమ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు.

రోడ్డు కోసం వినూత్న నిరసన

ఎన్నికల సమయంలో గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత తమ సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం విజ్ఞప్తులు చేస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే వినూత్న రీతిలో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు.

వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాడి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ సమస్యను ఇకనైనా పట్టించుకుని శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.