భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. మున్సిపల్ చైర్మన్

గణేష్ నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు : భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గణేష్ నిమజ్జన వేడుకలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ బీబీ కుతిజాతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తుమోల్ల దత్తాత్రి మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వేడుకలు విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో దాదాపు 80 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు : భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి

గడ్డెన్న వాగు నిమజ్జన పాయింట్ వద్ద భారీ కేడ్లు, సీసీ కెమెరాలు, క్రేన్లు, విద్యుత్ లైటింగ్‌తో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్ర సాగే మార్గంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లు, గుంతలను సరిచేసినట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, సోదరభావంతో నిర్వహించాలని తుమోల్ల దత్తాత్రి కోరారు. తమ ధర్మాన్ని గౌరవించుకుంటూనే ఇతర ధర్మాలను కూడా గౌరవించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, వీడియోలను పూర్తిగా నమ్మవద్దని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు నిమ్మల ప్రవీణ్ కుమార్, వడ్నప్ శ్రీనివాస్, ధర్మవరం శ్రీనివాస్, చర్ల సుభాష్, అమోల్ తదితరులు పాల్గొన్నారు.