భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

విశ్వకర్మ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా గంగానర్సయ్య

విశ్వకర్మ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా గంగానర్సయ్య

భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కడార్ల గంగానర్సయ్యను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు గంగానర్సయ్యను నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మాట్లాడుతూ గంగానర్సయ్య నియామకానికి సహకరించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్‌తో పాటు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మహిళా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కడార్ల గంగానర్సయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.

గంగానర్సయ్య నాయకత్వంలో నిర్మల్ జిల్లాలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మరింత బలోపేతం కావాలని పలువురు ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులు పాల్గొన్నారు.