భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం పోస్టుకార్డు ఉద్యమం

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం పోస్టుకార్డు ఉద్యమం

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేసి, ఈజేహెచ్ఎస్ పథకాన్ని వర్తింపజేయాలని వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే-హెచ్143 యూనియన్ అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ విగ్రహానికి జర్నలిస్టులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లను పోస్టుకార్డులపై రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు.

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం పోస్టుకార్డు ఉద్యమం

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను ప్రభుత్వ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పించాలని, ఈజేహెచ్ఎస్ పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు. ఈ మేరకు తమ డిమాండ్లను పోస్టుకార్డుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మోడల చంద్రశేఖర్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి బలిజ లింగేష్, సీనియర్ జర్నలిస్టులు ఏబీఎన్ జానీ, పాషా, 10 టీవీ కృష్ణ, సుంకరి రమేష్, ఆంజనేయులు, తిరుమలేష్, రజనీకాంత్ (ఆత్మకూరు), రవికాంత్, సాయిలు యాదవ్ (మదనాపురం), తిరుపతయ్య, గోవర్ధన్ (వనపర్తి), ఈశ్వరయ్య, పోలీస్ ప్రవీణ్ (పెద్దమందడి), లక్ష్మీనారాయణ, ముంత రాములు యాదవ్, సురేష్ గౌడ్ (కొత్తకోట), విజయ్ (పెబ్బేరు), రవీంధర్ (వీపనగండ్ల), శ్రీనివాస్ (చిన్నంబావి) తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జర్నలిస్టులందరూ పోస్టాఫీసుకు చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ డిమాండ్లతో కూడిన పోస్టుకార్డులు, ఉత్తరాలను పోస్టు చేశారు.