భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, సెప్టెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం

WhatsApp Image 2025-09-14 at 7.11.01 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేటలో ఉన్న గ్రీన్ హౌస్ పార్క్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి హనుమంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తం రావు, పెద్ది పెంటయ్య, అపెక్స్ కమిటీ కన్వీనర్ మీసాల చంద్రయ్యతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

 

ప్రస్తుతానికి 18 జిల్లాల్లో సభ్యత్వ నమోదు పూర్తైందని, మిగిలిన 33 జిల్లాల్లోనూ త్వరలో పూర్తి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు  సూచించారు. ప్రతి ఒక్క సభ్యుడు రూ. 100 సభ్యత్వ రుసుము చెల్లించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నరసింహులు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మామిళ్ల లింగం, కాసర్ల రవీందర్ సహా పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

 

మరిన్ని కథనాలు :

 

మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తి చేయాలి..