భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

జోరువానలోనూ ఆగని ప్రచారం.. కాటవరంలో ఇంటింటి పర్యటన

కాటవరంలో వర్షంలోనూ బత్తుల వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: వర్షం కురుస్తున్నా ఎన్నికల ప్రచారంలో వెనక్కి తగ్గకుండా జడ్పీటీసీ అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మి కాటవరం గ్రామంలో పర్యటించారు. సీతానగరం మండలంలోని ఈ గ్రామంలో జోరువానలోనే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు.

గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించిన ఆమె, జనసేన–టీడీపీ–బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

నవంబర్ 5న జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌లో 3వ నంబర్‌లో ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని బత్తుల వెంకటలక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.