భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

సింగవరంలో కూటమి అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం

సింగవరంలో కూటమి అభ్యర్థుల కోసం ఇంటింటా ప్రచారం

భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సింగవరం గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కుమార్తెలు తోట ప్రత్యూష దేవి, బత్తుల వందనాంబిక గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు.

సింగవరంలో కూటమి అభ్యర్థుల కోసం ఇంటింటా ప్రచారం

ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామంలోని పలువురిని కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.