భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలం వెలంపేట గ్రామంలో సీతానగరం-1 ఎంపీటీసీ అభ్యర్థి రాపాక వెంకటలక్ష్మి, జడ్పీటీసీ అభ్యర్థి బత్తుల వెంకటలక్ష్మికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ప్రచారానికి ముందు గ్రామంలోని ధనలక్ష్మి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గుర్తులపై ఓటు వేసి వారికి మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు మహిళలు పాల్గొన్నారు.