భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం

నేడు జిల్లాలో విద్యుత్ వినియోగం దార్ల దినోత్సవం మెదక్ జిల్లా విద్యుత్ శాఖ ఏఈ నారాయణ నాయక్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు నవంబర్ 3వ తేదీన జిల్లావ్యాప్తంగా విద్యుత్తు వినియోగదారుల దినోత్సవం (కన్స్యూమర్స్ డే) నిర్వహించనున్నట్లు జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. ఈ మేరకు మెదక్‌లోని తన కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు.

జిల్లాలోని రైతులు, గృహావసర విద్యుత్తు వినియోగదారులకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్తు సమస్యలతో పాటు మీటర్ల సమస్యలు, అధిక విద్యుత్తు బిల్లులు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు వైర్లకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు తెలిపారు.

నవంబర్ 3న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మెదక్, తూప్రాన్ డివిజనల్ కార్యాలయాలతో పాటు జిల్లాలోని ఆయా సబ్‌ డివిజనల్ కార్యాలయాలు, మెదక్ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు.

విద్యుత్తు వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని ఎస్‌ఈ నారాయణ నాయక్ వెల్లడించారు. జిల్లాలోని రైతులు, గృహావసర విద్యుత్తు వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.