భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..శ్రీనివాస్ రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..శ్రీనివాస్ రెడ్డి

నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నార్సింగి ఉపసర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డి నార్సింగి మండల కేంద్రంతో పాటు నర్సంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..శ్రీనివాస్ రెడ్డి

అనంతరం HDFC సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టి కొత్త రూపు సంతరించుకున్న నర్సంపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నార్సింగి మండలం అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందని, ఒకప్పుడు మండలంలో అత్యధికంగా గుడిసెలు ఉండేవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నార్సింగి గ్రామానికి తొలి విడతలోనే 100 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..శ్రీనివాస్ రెడ్డి

రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తాత్కాలికంగా ఉన్నప్పటికీ, ఎల్‌నినో కారణంగా ఏర్పడే కరువు పరిస్థితులు ఏళ్ల తరబడి కొనసాగవచ్చని వివరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సూచించిన ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..  కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..శ్రీనివాస్ రెడ్డి

అనంతరం తహసీల్దార్ గ్రేస్ బాయి మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. ధాన్యంలో తాలు లేకుండా శుభ్రం చేసుకోవడంతో పాటు తేమ శాతాన్ని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో TPCC సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, DCC కార్యదర్శి సంపత్ రెడ్డి, నర్సంపల్లి సర్పంచ్ భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు బాచి స్వామి, ఆటో జానీ, నరేష్, రాజేందర్, డైరెక్టర్లు రఫీ, శశిధర్ రెడ్డి, నాయకులు బాలరాజు గౌడ్, అంచనూరి రాజేష్, ప్రభాకర్, బోండ్ల శ్రీను, నరేందర్ రెడ్డి, నరసింహ రెడ్డి, నారాయణ రెడ్డి, ఐకేపీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.