భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

చిన్నారుల ఆరోగ్యానికి పోషకాహార అల్పాహారం

బ్రేక్ ఫాస్ట్ సద్వినియోగం చేసుకోవాలి..                       సర్పంచి రేణుక నరేష్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్న అల్పాహారాన్ని చిన్నారులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బానోతు రేణుక నరేష్ నాయక్ సూచించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు అందించే పోషకాహారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందేలా చూడాలని తెలిపారు.

బ్రేక్ ఫాస్ట్ సద్వినియోగం చేసుకోవాలి..                       సర్పంచి రేణుక నరేష్

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని పెద్ద తండా అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం సర్పంచ్ రేణుక నరేష్ బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వివిధ వర్గాలకు అందిస్తున్న పోషకాహార సేవలను అర్హులైన వారంతా వినియోగించుకోవాలని కోరారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు సరఫరా చేసే ఫీడింగ్‌ను ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు.

బ్రేక్ ఫాస్ట్ సద్వినియోగం చేసుకోవాలి..                       సర్పంచి రేణుక నరేష్

అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో సర్పంచ్ ఆప్యాయంగా ముచ్చటించారు. వారికి అక్షరాలు నేర్పిస్తూ కొంతసేపు సరదాగా గడిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శిరీష జగన్, వార్డు సభ్యుడు భూక్యా నరహరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యుగేందర్, ఆశా వర్కర్ శోభ, హెల్పర్ మౌనిక, గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు, తండా వాసులు పాల్గొన్నారు.