భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

బహిరంగంగా మద్యం తాగితే కేసులే.. SI హెచ్చరిక

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు  ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వలిగొండ SI శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలు, పాడుబడిన వెంచర్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించే వారిపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా వలిగొండ పట్టణ శివారులోని ఓ పాడుబడిన వెంచర్‌లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని SI శ్రీకాంత్ రెడ్డి సూచించారు.