భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

రావిరాలలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

అమరవీరుల ఆశయాలసాధనే వారికి నివాళి..                          కా.మండల వెంకన్న

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భూమి కోసం, భుక్తి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను కొనసాగించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కా. మండల వెంకన్న తెలిపారు. నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో కామ్రేడ్ సురేషన్న, గణపతిల స్తూపాల వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.

అమరవీరుల ఆశయాలసాధనే వారికి నివాళి..                          కా.మండల వెంకన్న

అనంతరం జరిగిన సభలో మండల వెంకన్న మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా భూసమస్యకు పరిష్కారం లభించలేదని, పేదల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని ప్రభుత్వాల తీరుపై విమర్శలు చేశారు. అమరవీరుల సంస్మరణ సభలు కేవలం పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాలుగా మిగిలిపోకూడదని అన్నారు. వారు కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యపరచాలని, వారి ఆశయాల సాధన దిశగా ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న, జిల్లా నాయకులు చిర్ర యాదన్న, బట్టు చైతన్య, డివిజన్ నాయకులు నక్క యాకన్న, పల్లె రమేష్, గుగులోతు వీరన్న, తారమ్మ, మైబు, వెంకన్న, రమేష్, భూలక్ష్మి, యశోద, యాదమ్మ, స్వరూప, సరిత, గాద విజయ, చిన్నా, రేణుక, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.