భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

వైఎస్ఆర్ సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు

13

భారత్ స‌మాచార్.నెట్‌, తూర్పుగోదావరి: ‘ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జక్కంపూడి రాజా ఇంటి వద్ద నుంచి బయలుదేరిన జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాల్, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువ నాయకులు జక్కంపూడి గణేష్ సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన నాయకులు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ట్రాన్స్ జెండర్ల మనోభావాలు దెబ్బతీయవద్దు: హిజ్రా హక్కుల సంఘం