భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు: హరీష్ రావు

54cb31e5-aebb-4f25-a77b-e01a0a509d82

భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నంగునూరు మండలంలోని నాగరాజుపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, ఇమామ్, హమీద్, జకిరెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.