భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, సెప్టెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

వసతి గృహాన్నిప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

2

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులో నూతనంగా నిర్మితమైన ప్రభుత్వ గిరిజన బాలికల ఇంటర్, డిగ్రీ వసతి గృహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా గిరిజన అధికారి సతీష్ హాజరయ్యారు. బంజారా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోగ్ బండార్ కార్యక్రమంలో పోచారం పాల్గొని జగదంబా మాత, సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దుర్గం శ్యామల శ్రీనివాస్, బాన్సువాడ, నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ వసతి గృహం గిరిజన బాలికల విద్యా అభ్యాసానికి మరింత ఊతమిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.