భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

24

భారత్ సమాచార్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కు చెందిన రౌడీషీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్ట్ పెట్టినందుకు అతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని, అతనిని అరెస్టు చేయడం జరిగిందని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. నిందితుడు షేక్ ఇర్ఫాన్ టాంజానియా దేశంలో ఉంటూ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి silsila adb అనే వాట్సప్ గ్రూపు యజమానిగా వ్యవహరిస్తూ, వాట్సాప్ గ్రూపు నందు పోలీసులను కించపరిచేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా విమర్శలు చేసి ఇరు వర్గాల మధ్య గొడవలు దారి తీసేలా పోస్టులు పెట్టినందుకు గాను అతనిపై ఏప్రిల్ 15వ తారీఖున ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయిందన్నారు. అతను ఇతర దేశంలో ఉన్నందున అతనిపై ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా, ఇదివరకే ఇతనిపై ఎల్ఓసి జారీ అయిన విషయాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అందజేయడం జరిగింది. జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా ప్రత్యేక బృందం అతనిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డి.ఎస్.పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. ఇతనిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇది వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా గొడవలకు దారి తీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల నందు సోషల్ మీడియాలో నందు పోలీసులను కించపరిచేలా, పోలీసు విధులకు భంగం కలిగించేలా, మనోభావాలకు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతని వద్దనుండి ఒక పాస్ పోర్ట్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్ఐ పీర్ సింగ్, విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని కథనాలు: 

పేకాట స్థావరంపై దాడి.. 9మంది అరెస్ట్