భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేసముద్రంలో ఘోర ఘటన జరిగింది. నారాయణపురం గ్రామంలోని పందుల మనీష్ అనే బాలుడిపై గత జూలైలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఇంట్లోని వారు అరవడంతో దుండగులు పారిపోయారు. బుధవారం రాత్రి మళ్లీ అదే బాలుడిని ఎవరో ఉరివేసి హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని కథనాలు:
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం