భారత్ సమాచార్, పెద్దపల్లి జిల్లా: రామగుండం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఏ.అఖిల్ ప్లంబర్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, శ్వాసనాళ సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అఖిల్‌కు ఇప్పటికే రూ.10లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అఖిల్ బ్రతకాలంటే రూ.8లక్షల నుంచి 10లక్షల వరకు ఖర్చు అవుతుందని, మెజర్ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. తన కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.
మరిన్ని కథనాలు:
బాధితుడికి ‘సహయోగ్’ ఫౌండేషన్ ఆర్థిక చేయూత