భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు

4

భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండలం విజయనగరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సింగరేణి కార్మికుడు తన ద్విచక్ర వాహనంపై నైట్ డ్యూటీ కి వెళ్లి వస్తుండగా విజయనగరం నాగులమ్మ గుడి దగ్గర ఆగి ఉన్న లారీ ఢీకొడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎటువంటి పార్కింగ్ సిగ్నల్ లేకుండా నడి రోడ్డు మీద లారీని నిలిపి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. తక్షణమే స్పందించిన స్థానికులు చికిత్స కొరకు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి ఖమ్మం తరలించినట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని కథనాలు: 

‘పరిశుభ్రత ప్రతి పౌరుడి విధి’