భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతరకు పటిష్ట భద్రత

WhatsApp Image 2025-09-27 at 2.06.55 PM

భార‌త్ స‌మాచార్‌.నెట్, నిర్మల్ జిల్లా : ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అడెల్లి మహపోచమ్మ దేవస్థానంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గంగ నీళ్ళ జాతర కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతర బందోబస్తునుద్దేశించి జిల్లా ఎస్పీ జానకి షర్మిల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమ్మవారి ఆభరణాల శుద్ధి కార్యక్రమం నుంచి దేవస్థానం చేరే వరకు ప్రతి దశలో పకడ్బందీ భద్రత అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.


ముఖ్యంగా గోదావరి ఘాట్ వద్ద వరద నీరు ఎక్కువగా ఉన్నందున పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సీసీ కెమెరాల నిఘాతో పాటు, ముఖ్యంగా మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేక మహిళా దళం (శివంగి బృందం)ను నియమించినట్లు తెలిపారు. భక్తులు అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

నివాళులర్పించిన మాజీ మంత్రి ఐకే రెడ్డి