భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

‘తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ సేవలు చిరస్మరణీయం’

02

భార‌త్ స‌మాచార్.నెట్, నిర్మల్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన చిరస్మరణీయ సేవలు భావితరాలకు ఆదర్శమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వద్ద శనివారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో ఆయన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఉద్యమంలో భాగంగా తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు బాపూజీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు చిలుక రమణ, జల్ద రమణ, గుమిడ్యాల దత్తాద్రి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయ్యన్నగారి పోశెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

మ‌రిన్ని క‌థ‌నాలు

అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతరకు పటిష్ట భద్రత