భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

అపరిశుభ్రతతో వల్లభ్ నగర్ కాలనీ

12a

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా:  పట్టణ కేంద్రంలో అభివృద్ధి, పరిశుభ్రతకు నోచుకోని దుస్థితుల్లో 33వ వార్డు వల్లభ్ నగర్ కాలనీవాసులు అపరిశుభ్రతతో ఉండడం వలన రోగాలు ప్రబలుతున్నాయని ఈ వార్డులో ఇప్పటివరకు క్రమబద్ధంగా మోరీల శుభ్రపరిచే చర్యలు జరగకపోవడంతో, డ్రైనేజీలు దుర్వాసనతో నిండిపోయి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న పెద్ద మోరీలో పెద్ద పెద్ద చెట్లు పెరిగి నీరు వెళ్లే మార్గం మూసుకుపోవడంతో, నీటితో పాటు పాములు, కీటకాలు ఇళ్లలోకి చేరుతున్నాయి. కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా, ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు ఇప్పటికైనా అధికారులు మోరీలన్నీ శుభ్రం చేసి, గుడి పక్కన ఉన్నపెద్ద మోరీలో పెరిగిన చెట్లు, ముళ్లు, చెత్తను తొలగించాలంటూ కాలనీవాసులు కోరుతున్నారు.