భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

కుల నిర్మూలనకు కృషి చేయాలి: సీపీఐ ఎంఎల్

WhatsApp Image 2025-09-29 at 8.47.39 PM

భాారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్ జిల్లా : మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో దేశంలో కుల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ పోరాడాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జగన్ సింగ్ పిలుపునిచ్చారు. కుల వివక్షను, అణిచివేతను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలని ఆయన ఉద్ఘాటించారు. ఆదిలాబాద్‌లోని నిషాన్ ఘాట్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడారు.

 

ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ, కులాలను, మతాలను ప్రోత్సహించే విధానాలను ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని తీవ్రంగా ఆరోపించారు. సామాన్య ప్రజలందరూ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల రహిత సమాజం కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని జగన్ సింగ్ ఈ సందర్భంగా కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో యువత క్రియాశీలకంగా పాల్గొనాలని కోరారు.

 

మరిన్ని కథనాలు : 

 

బైక్ దొంగలు అరెస్ట్