భారత్ సమాచార్, జయశంకర్ భూపాలపల్లి: జిల్లా పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు కర్తవ్య నిబద్ధతతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీస్ అధికారులను, పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ పాల్గొని రిటైర్డ్ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ‘పోలీసు సేవలు అత్యంత కఠినమైనవి. కుటుంబ సౌకర్యాల కంటే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేయడం మీ ప్రత్యేకత. ఎన్నో ఒత్తిడులు, సవాళ్ల మధ్య విధులను విజయవంతంగా నిర్వర్తించారు. పదవీ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇకపై కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా మరింత సంతృప్తి పొందవచ్చు’ అని సూచించారు. సన్మానితులైన అధికారులు.. B. రవీందర్ రెడ్డి (ASI, రేగొండ పోలీసు స్టేషన్)G. రాజేశం (ASI, గోరి కొత్తపల్లి పోలీస్ స్టేషన్) వారికి, వారి కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేస్తూ వారి సేవలను గుర్తించారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా సేవలతో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి గౌరవం లభించడమే కాకుండా, ప్రస్తుత సిబ్బందికి ప్రేరణనిచ్చేలా మారిందని అధికారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్ఐ రత్నం, పోలీస్ సంఘం ప్రతినిధి మర్కాలయాది రెడ్డి, రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు:
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పశువులతో నిరసన