భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

బొమ్మనబోయిన వెంకటేశ్వర్లుకు టీడీపీ శ్రేణుల సన్మానం

23

భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా:  CS పురం మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం కనిగిరి టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  తను ఆ స్థాయిలో ఉండడానికి కారణం అయిన కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.