భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

వేములవాడలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‘పథసంచలన్’

WhatsApp Image 2025-10-05 at 8.40.34 PM

భారత్ స‌మాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వందేళ్ల స్థాపన ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలో ఆదివారం పథసంచలన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక పద్మశాలి సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ మండల ఏక్ ప్రభారి జక్కుల సత్యనారాయణ మూర్తి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ దేశభక్తి, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని ఆయన తెలిపారు.

 

హిందువులలో ఐక్యత, హిందుత్వ జీవన విధానమే విశ్వశాంతికి ఆధారం అని వివరించారు. దేశాభివృద్ధికి హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. వేములవాడ పట్టణ పరిసర గ్రామాల స్వయం సేవకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో ఎస్పీ