భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

రోటవేటర్‌లో పడి యువకుడు మృతి

WhatsApp Image 2025-10-05 at 8.50.15 PM

భారత్ స‌మాచార్.నెట్, వనపర్తి జిల్లా : గోపాల్‌పేట మండలం ఎదుట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో చిక్కుకుని ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని పానగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, రాజు ఎదుట్ల గ్రామంలో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని, పంట పండించడానికి పొలాన్ని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో రోటవేటర్‌కు చిన్న సమస్య రావడంతో దానిని పరిశీలిస్తుండగా, డ్రైవర్ అకస్మికంగా క్లచ్ వదలడంతో రాజు రోటవేటర్‌లో చిక్కుకుపోయాడు. తీవ్ర గాయాల కారణంగా అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

 

సంవత్సరం కిందటే రాజుకు వివాహం జరిగింది. దీంతో ఈ విషాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

అపరిశుభ్రతతో వల్లభ్ నగర్ కాలనీ