భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, అక్టోబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా యస్. యం. విజయ్ కుమార్

28

భారత్ సమాచార్, సిద్దిపేట్ జిల్లా: జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా యస్. యం. విజయ్ కుమార్ నియమితులయ్యారు. కమిషనర్ ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి తదనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సిహెచ్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఎసిపి నరసింహులు, హుస్నాబాద్ ఏసీపి సదానందం, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, పోలీస్ అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది అధికారులు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ గారిని కలసి మొక్కలను అందజేశారు. కమిషనర్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ అందరూ కలిసి టీం వర్క్ చేయాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, సదానందం, నరసింహులు, రవీందర్, సుమన్ కుమార్, శ్రీనివాస్, మరియు ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.