భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, అక్టోబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

దిష్టిబొమ్మలు అమ్ముకునే వ్యక్తి ఆత్మహత్య

WhatsApp Image 2025-10-06 at 9.17.53 PM

భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గుట్టలో సోమవారం ఉరివేసుకొని పూసల బద్రి (45) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా కోటపేటకు చెందిన బద్రి, తిరుమలగిరిలో దిష్టిబొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

CMRF చెక్కులు.. అక్రమాలకు పాల్పడ్డ 8 మంది నిందితుల అరెస్ట్