భారత్ సమాచార్.నెట్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పోలీస్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. కృషి, నిబద్ధత ఉంటే మనుషులు మహాపురుషులు కాగలరని, దీనికి వాల్మీకి జీవితమే నిదర్శనమని ఆయన అన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి, సప్తర్షుల బోధనల ద్వారా మారి, రామాయణం అనే అమరగ్రంథాన్ని అందించిన వాల్మీకి ఆశయాలను పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఏవో పద్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
రేపు బీసీ 42% రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు