భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, అక్టోబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ

WhatsApp Image 2025-10-07 at 7.16.21 PM

భారత్ సమాచార్.నెట్, ఆదిలాబాద్: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తాంసి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించి, రానున్న ఎన్నికల సన్నద్ధతపై సిబ్బందితో మాట్లాడారు. మండలాల్లో గ్రామ స్థాయిలో సత్సంబంధాలు ఏర్పరచుకుని ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు.

వీపీవో విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గంజాయి, సైబర్ క్రైమ్ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న రికార్డులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాజర్షి షా