భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, అక్టోబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ఆర్వో కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WhatsApp Image 2025-10-08 at 9.56.03 PM

భారత్ సమాచార్.నెట్, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం రాత్రి జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కేంద్రాన్ని తనిఖీ చేశారు. తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, రేపటి నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించనున్న నేపథ్యంలో, ఆమె అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో గోవింద్, ఎంపీడీవో గజానన్, అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

కళాశాలల్లో నాణ్యమైన వసతులు, విద్య అందించాలి