భారత్ సమాచార్, జగిత్యాల జిల్లా: తెలంగాణలో మాజీ ప్రజా ప్రతినిధులు తమ పదవి కాలం ముగిసిన తరువాత కూడా తమ వాహనాలపై స్టిక్కర్లు ఉంచడం కొనసాగిస్తున్నారు. రాయికల్ పట్టణంలోని ఓ పెయింట్ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉపయోగిస్తున్న కారుకు ముందు భాగంలో ఎమ్మెల్సీ స్టిక్కర్, వెనుక వైపు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రోటోకాల్ నియమాల ప్రకారం పదవిలో ఉన్నంతకాలం మాత్రమే అధికారిక గుర్తులు వాహనాలపై ఉంచవచ్చు. పదవి గడువు పూర్తయ్యాక వాటిని తీసివేయడం తప్పనిసరి. లేకపోతే మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా, లేదా ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి గుర్తులు కొనసాగించడం ప్రజల్లో తప్పుదోవ చూపడమే కాక,ప్రభుత్వ చిహ్నాల దుర్వినియోగంగా పరిగణించబడుతుంది. అధికారులు, పోలీసు విభాగం ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని కథనాలు:
ఎన్నికల నియమావళిని పటిష్టంగా పాటించండి: ఎస్పీ