భారత్ సమాచార్.నెట్, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్‌తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నీటి మూటలయ్యాయని ధ్వజమెత్తారు. రైతు బోనస్, పెండింగ్ జీతాలు, నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి, చేయూత వంటి హామీల గురించి ప్రస్తావన లేదని ఆరోపించారు. పరిపాలనను నిర్లక్ష్యం చేసి, పగ ప్రతీకారాలతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు
ప్రజల భద్రతకు పెద్దపీట: సీపీ