భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

స్థానిక ఎన్నికలకు ఎంపీటీసీ అభ్యర్థి ప్రకటన

WhatsApp Image 2025-10-09 at 6.49.22 PM

భారత్ సమాచార్.నెట్, జనగామ: పాలకుర్తి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సిరెడ్డి ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో కోలుకొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా దామెర వెంకటేశ్వర్లును ప్రకటించుకున్నారు.

ఈ అభ్యర్థి ప్రకటన కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, వెంకటేశ్వర్లుకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ నిర్ణయం నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య