భారత్ సమాచార్.నెట్, నల్గొండ: కుల, మతాలకు అతీతంగా, మానవత్వమే గొప్ప మతంగా విశ్వసించే కొందరి స్నేహబంధం ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది. త్రిపురారం మండలం రాగడప గ్రామానికి చెందిన ముస్లిం సోదరుడు షేక్ జానీ పాషా.. తన దయాగుణాన్ని చాటుకున్నారు.
తన స్వగ్రామానికి చెందిన కొందరు హిందూ సోదరులు అయ్యప్ప మాల ధరించాలని నిర్ణయించుకోగా, సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న జానీ పాషా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వారందరికీ అయ్యప్ప మాల ధారణకు సంబంధించిన దుస్తులను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందజేశారు. తన మతాన్ని గౌరవిస్తూనే, ఇతర మతాల విశ్వాసాలను మన్నించే ఆయన మనసును పలువురు గ్రామస్థులు, ప్రజలు అభినందిస్తున్నారు.
మరిన్ని కథనాలు
బైకును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ఒకరు స్పాట్ డెడ్