భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, అక్టోబర్ 2025, శనివారంభారత్ సమాచార్

నేర నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం

WhatsApp Image 2025-10-10 at 7.51.57 PM

భారత్ స‌మాచార్.నెట్, ఆదిలాబాద్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కేడీలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. అమాయక ప్రజలను వేధించే వారి కదలికలను ఇకపై ప్రతివారం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు ఇబ్బందులు కలిగించే వారిపై వెంటనే బైండోవర్ చర్యలు చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని సూచించారు.

 

ఈ ఏడాది ఇప్పటికే 40 కిలోల గంజాయి, 2200 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని 290 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి పండించినా, సేవించినా కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని, ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాదం ఉందని యువతకు వార్నింగ్‌ ఇచ్చారు. నేర పరిశోధనలో అప్రమత్తంగా ఉంటూ, ప్రతి నిందితుడి వేలిముద్రలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు :

 

160 గంజాయి మొక్కలు స్వాధీనం