భారత్ సమాచార్.నెట్, జయశంకర్ భూపాలపల్లి : ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలకు త్వరితగతిన న్యాయం అందించే లక్ష్యంతో భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే స్వయంగా పాల్గొని, ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 12 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ.. వాటి పరిష్కారం కోసం తక్షణమే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి, చట్టబద్ధ పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలి. శాంతి భద్రతలను కాపాడుతూ, ప్రజలకు మరింత దగ్గరగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రతి సోమవారం జరిగే ఈ ప్రజా దివాస్ ద్వారా ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుంది” అని పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు :
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం