భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి

04

భారత్ సమాచార్.నెట్, నల్గొండ: దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు అనుమతి మంజూరు కోసం లంచం తీసుకుంటున్న అగ్నిమాపక శాఖ కార్యాలయంలోని ఒక అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. షాపు నిర్వాహకుడి వద్ద రూ.8వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటన అగ్నిమాపక శాఖ కార్యాలయంలో కలకలం సృష్టించింది. ఏసీబీ బృందం ప్రస్తుతం కార్యాలయంలో విస్తృత తనిఖీలు చేపట్టి, పట్టుబడిన అధికారిని విచారిస్తోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని క‌థ‌నాలు

 నిండుకుండలా నాగార్జున సాగర్ జలాశయం.. 8 గేట్లు ఎత్తివేత